అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన

ABN , First Publish Date - 2021-07-13T04:48:07+05:30 IST

నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్‌వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన
బుట్టాయగూడెం ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ఆందోళన

నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్‌వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్‌వాడీ సెంటర్లను కొన్నిటిని ప్రాఽథమిక పాఠశాలల్లో విలీనం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పేద గర్భిణులు, బాలింతలకు, పిల్లల తల్లులకు అంగన్‌వాడీలు అనేక సేవలందిస్తున్న వర్కర్లను నిర్లక్ష్యం చేయడం తగదని నినదించారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీచేయాలని, యాప్‌ల ద్వారా పనిభారాన్ని తగ్గించాలని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలన్నారు. కనీస వేతనం రూ.21 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.బుట్టాయగూడెం, జూలై 12: అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌, సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో బుట్టాయగూడెం ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం అంగనవాడీలు ధర్నా చేశారు. సూపర్‌వైజర్‌ విజయలక్ష్మికి  విన తిపత్రం అందజేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.నాగమణి టి.రామ లక్ష్మి, కె.పుష్ప, వీఎస్‌.కృపామణి, టి.రామయమ్మ, టి.సుధా, ఎస్‌కె నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.


కొవ్వూరు: అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్య క్ష, కార్యదర్శులు వి.శ్రీదేవి, సీహెచ్‌.మాణిక్యాంబ ఆధ్వర్యంలో కొవ్వూరు ఐసీడీ ఎస్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. పట్టణ, మండలంలోని సీఐటీ యూ కార్యదర్శి ఎం.సుందరబాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు.


నల్లజర్ల: ఐసీడీఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా ప్రభుత్వం తెచ్చిన 172 సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని నల్లజర్ల అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షరాలు జి.దీన స్వరూపరాణి డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద అంగన్‌వాడీ టీచర్లు అందోళన చేశారు. సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మికి వినతి పత్రం అందించారు. కె.కనకదుర్గ, ప్రభరాణి, వై.బేబి పాల్గొన్నారు.


పోలవరం: నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు కుమారి డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేసి ఐసీడీఎస్‌ పీఓకి వినతిపత్రం సమర్పిం చారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భారతి, టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:48:07+05:30 IST