AP: బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
ABN , First Publish Date - 2021-12-16T16:04:23+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పసుపులేటి మంగ(46), మల్లాడి నాగమణి (65) అనే ఇద్దరు మహిళలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కాగా జల్లేరు వాగులో బస్సు పడిన ఘటనలో పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.