మహనీయులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2021-11-06T05:12:17+05:30 IST

అమరజీవిపొట్టి శ్రీరాములును విస్మరించటం తగదని గురజాడ అప్పారావు ముని మనవడు, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ మోపిదేవి విజయ్‌ గోపాల్‌ (విశాఖపట్నం) ఆవేదన వ్యక్తం చేశారు.

మహనీయులను స్మరించుకోవాలి
వేదికపై ప్రముఖులు, బహుమతులు అందుకున్న విద్యార్థులు

గురజాడ అప్పారావు ముని మనవడు మోపిదేవి విజయ్‌ గోపాల్‌


భీమవరంటౌన్‌, నవంబరు 5 :  అమరజీవిపొట్టి శ్రీరాములును విస్మరించటం తగదని గురజాడ అప్పారావు ముని మనవడు, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ మోపిదేవి విజయ్‌ గోపాల్‌ (విశాఖపట్నం) ఆవేదన వ్యక్తం చేశారు. సమైఖ్య భారతి ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో  నిర్వహిస్తున్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు.  బ్రిటిష్‌ వారి కబంద హస్తాల నుంచి స్వాతంత్య్ర సాధించి పెట్టిన మహనీయులను సదా స్మరించుకోవాలన్నారు. 12 పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ను సమాఖ్య భారతి కన్వీనర్‌ పి.కన్నయ్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి వెంకట్రాయుడు, గమిని సుబ్బారావు, బుద్దాల రామారావు, గట్టిం మాణిక్యాలరావు, జిల్లా కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, మానేపల్లి నాగన్నబాబు, కంతేటి వెంకట్రాజు, ఏలేటి న్యూటన్‌, ఆరేటి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T05:12:17+05:30 IST