ప్రభుత్వానికి ఇచ్చేద్దాం

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

జిల్లాలోని ఎనిమిది ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి స్వాధీనం చేసుకు నేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.

ప్రభుత్వానికి ఇచ్చేద్దాం

ఎనిమిది ఎయిడెడ్‌ పాఠశాలలు అంగీకారం

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 22 : జిల్లాలోని ఎనిమిది ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి స్వాధీనం చేసుకు నేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. బుట్టాయిగూ డెం మండలం కండ్రికగూడెం, మెరకగూడెం, అమ్మపాలెం, కొమ్ముగూడెంలలోని నాలుగు ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశా లలు, ఏలూరు నగర పరిధిలోని రెండు ప్రాఽథమిక పాఠశా లలు, రూరల్‌ మండల పరిధి పాలగూడెంలోని ఒక ప్రాఽథ మికోన్నత పాఠశాల, భీమవరంలోని ఓ సంస్కృత హైస్కూ ల్‌ను భూమి, భవనాలు, ఉపాధ్యాయ పోస్టులు సహా ప్రభుత్వానికి స్వాధీన పరిచేందుకు యాజమాన్యాలు అంగీ కరించినట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు. ఇంటర్‌ విద్యకు సంబంధించి స్థిరాస్తులు సహా స్వాధీనం చేసేందు కు ఒక్క కళాశాల అంగీకరించలేదు. డిగ్రీ విద్యకు సంబం ధించి యాజమాన్యాలకు ఇంత వరకు ప్రతిపాదనలు ఏమీ పంపలేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఖాళీ పోస్టులు సహా (స్థిరాస్తులు మినహా) స్వాధీనానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ఎయిడెడ్‌ కళాశాల యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని సమాచారం. మొత్తం మీద భూమి, లేదా స్థలం, భవనాలను ప్రభుత్వానికి స్వాధీనం చేసేందు కు మెజారిటీ సంఖ్యలో ఎయిడెడ్‌ యాజమాన్యాలు అంగీ కరించలేదని స్పష్టమైంది. ప్రభుత్వ భూములు, స్థలాల్లో వున్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణకే వదిలేయకుండా వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST