దాళ్వా సా..గు

ABN , First Publish Date - 2021-12-30T05:43:11+05:30 IST

అన్న దాతలు అధికారుల ఆదేశాలు పాటిస్తున్నారు.. సాగుకు ముందడుగు వేస్తున్నారు.

దాళ్వా సా..గు

ముమ్మరంగా నారుమడులు


పాలకొల్లు రూరల్‌, డిసెం బరు 29 : అన్న దాతలు అధికారుల ఆదేశాలు పాటిస్తున్నారు.. సాగుకు ముందడుగు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా సార్వా కోతలు పూర్తి కావ డంతో దాళ్వా సాగుకు ఆకు మడులు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారుల సూచనల మేరకు ఈ నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రకృతి విలయం కారణంగా సార్వాలో సగం పంట పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులకు ఈ ఏడాది నష్టాలు తప్పలేదు. దాళ్వాలో శివారు ప్రాంతాల్లో సైతం నీరందిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికి శివారు ప్రాంత రైతులు దాళ్వా సాగుకు ఈ ఏడాది దూరంగా ఉందామని ఆలోచిస్తున్నారు. అధికారుల నిర్ణయంపై ఆధారపడి సాగుకు సన్నద్ధమవ్వాలని రైతాంగం అనుకుంటున్నారు.

Updated Date - 2021-12-30T05:43:11+05:30 IST