దళితులపై దాడులను అరికట్టాలి

ABN , First Publish Date - 2021-08-28T04:52:22+05:30 IST

దళితులపై దాడులను అరికట్టాలని, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

దళితులపై దాడులను అరికట్టాలి
దొండపూడిలో న్యూడెమోక్రసీ నాయకుల నిరసన

గోపాలపురం, ఆగస్టు 27: దళితులపై దాడులను అరికట్టాలని, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. దొండపూడిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. శ్రీనివాసపురంలో ముప్పిడి రాజు హత్య కేసులో దోషులను ఇంత వరకు అరెస్టు చేయక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో కె.లత, కప్పల ప్రశాంతి, ముక్కా రెడ్డి, కుంపట్ల ఏసు, కారం రాఘవ, తదితరులు పాల్గొన్నారు.


జీలుగుమిల్లి: దళితులపై దాడులను అరికట్టాలని  సీపీఐఎంఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీ ల్దారు జి.ఎలీషాకు వినతిపత్రం అందజేశారు. జంగారెడ్డిగూడెం, పెదవేగి, కొవ్వూరు మండలాల్లో జరిగిన సంఘటనలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలన్నారు. నాయకులు వెట్టి సుబ్బన్న, ఎ.ధర్మారావు, వి.భారతి, కె.నాగేశ్వరావు, ఇ.భూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:52:22+05:30 IST