ప్రజలపై భారం మోపిన ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-05-30T06:21:29+05:30 IST

దేశమంతా కరోన వైరస్‌తో ప్రజలందరూ ప్రాణాలతో పోరాటం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెద్దఎత్తున పెం చారని ఏలూరు జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు జెట్టి గురునాథరావు విమర్శించారు.

ప్రజలపై భారం మోపిన ప్రభుత్వాలు
జంగారెడ్గిగూడెంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు నిరసన

జంగారెడ్డిగూడెం, మే 29: దేశమంతా కరోన వైరస్‌తో ప్రజలందరూ ప్రాణాలతో పోరాటం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెద్దఎత్తున పెం చారని ఏలూరు జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు జెట్టి గురునాథరావు విమర్శించారు. జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో నిత్యావసర, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై జంగా రెడ్డిగూడెంలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. గురునాథరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ధరలు పెంచడంలో  మాత్రం ముందున్నారన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం, కొవిడ్‌ బాధితులకు వైద్య సదుపాయం అందకపోవడం, ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నార న్నారు. వైద్య పరికరాలు, మందులపై టాక్స్‌ వేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూ డాయిల్‌ ధరలు తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం వస్తేనే తమ బతుకులు బాగుంటాయని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్‌, ముప్పిడి శ్రీనివాస రావు, నులకాని నాగబాబు, వీరవల్లి సోమేశ్వరరావు, అట్లూరి శ్రీను, అట్లూరి సతీష్‌, దాకవరపు రవి, పిండి రాము, మెగలినీడి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T06:21:29+05:30 IST