ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T04:57:41+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి సహృదయ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి
నల్లజర్లలో జీవో కాపీలను దహనం చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు

నల్లజర్ల, జూన్‌ 22 : ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి సహృదయ్‌ డిమాండ్‌ చేశారు. నల్లజర్లలో జీవో  నెంబరు 39 కాపీలను మంగళవారం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని జీవో 39లో పేర్కొనడం తగదన్నారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు గుదే వెంకట సుబ్బారావు, పాము శ్రీను, యలమర్తి దిలీప్‌, రామకృష్ణ, హేమంత్‌, అజయ్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:57:41+05:30 IST