తణుకు ఆస్పత్రి వద్ద ధర్నా
ABN , First Publish Date - 2021-10-30T04:58:12+05:30 IST
ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు డిమాండ్ చేశారు.
బాలిక మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తణుకు, అక్టోబరు 29: ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం పెనుమంట్ర మండలం మార్టేరులోని బాలికల వసతి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంలో పలు కుల సంఘాల నాయకులు ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనుకుల రమేష్, మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు పుష్పరాజు, మాల ఐక్యవేదిక అధ్యక్షుడు రవదేవా, ఎస్సీ సెల్ నాయకులు పీతల బాబ్జి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.