నిరక్షరాస్యులను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:54:13+05:30 IST

గ్రామాల్లో 15 నుంచి 50ఏళ్ల లోపు నిరక్షరాస్యులను గుర్తించాలని కొవ్వూరు డివిజన్‌ వయోజన విద్య సూపర్‌వైజర్‌ కేవీవీ సత్యనారాయణ అన్నారు.

నిరక్షరాస్యులను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కేవీవీ సత్యనారాయణ

దేవరపల్లి, ఏప్రిల్‌ 12: గ్రామాల్లో 15 నుంచి 50ఏళ్ల లోపు నిరక్షరాస్యులను గుర్తించాలని కొవ్వూరు డివిజన్‌ వయోజన విద్య సూపర్‌వైజర్‌ కేవీవీ సత్యనారాయణ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీ డీవో ఎస్‌వీఎస్‌.ప్రసాద్‌ అధ్యక్షతన ఫడన లిఖినా అభియాన్‌ (నిరక్షరాస్యుల ను గుర్తించి వారికి చదువు చెప్పే) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి 45 రోజుల పాటు చదువు నేర్పించే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ అన్నారు. దేవరపల్లి, గోపాలపురం, పోలవరం మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఎం శ్రీనివాసరావు, వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:54:13+05:30 IST