ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-12-30T05:54:04+05:30 IST

రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిం ది.

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

యలమంచిలి, డిసెంబరు 29 : రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందిం ది. మండలంలోని కొంతేరు గ్రామానికి చెందిన రేజేటి వీరమ్మ(55) బుధవారం తెల్లవారుజామున కాజపడమరలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్లింది. సాయంత్రం దొంగ బాబి మోటారుసైకిల్‌పై కొంతేరు బయలుదేరగా కాజపడ మర గ్రామం ప్రధాన రహదారిపై కొబ్బరికాయల లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రగాయాలైన వీరమ్మను 108లో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమఽధ్యంలో మృతి చెందింది.దొంగ బాబి స్వల్పగాయాలతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశా డు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-12-30T05:54:04+05:30 IST