కోలుకుంటున్న వ్యాన్‌ ప్రమాద బాధితులు

ABN , First Publish Date - 2021-12-20T04:58:04+05:30 IST

మినీ వ్యాన్‌ మురికికాల్వలో బోల్తా పడిన సంఘటనలో గాయపడిన బాధితులు కోలుకుంటున్నారు.

కోలుకుంటున్న వ్యాన్‌ ప్రమాద బాధితులు

 నరసాపురం, డిసెంబరు 19 : మినీ వ్యాన్‌ మురికికాల్వలో బోల్తా పడిన సంఘటనలో గాయపడిన బాధితులు కోలుకుంటున్నారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, చింతరేవుకు చెందిన 24 మంది కార్మి కులు వ్యవసాయ పనుల నిమిత్తం పట్టణంలోని స్టేషన్‌ పేట ప్రాంతానికి వచ్చారు. వీరంతా  శనివారం సాయంత్రం మినీవ్యాన్‌లో తిరిగి గ్రామాలకు వెళుతుండగా క్రిస్టియన్‌పేట సమీపంలోని సరిపల్లి మురు గుకాల్వలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో మొత్తం 26 మందికి స్వల్పగాయాలు కాగా, వారిలో ఆరు గురు మురుగునీరు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. 19 మందికి ప్రాఽథమిక వైద్య అందించి ఇంటికి పంపించి వేశారు.ఆరుగురిని ఆస్పత్రిలో ఉంచారు. ఆరోగ్యం మెరుగుపడ డంతో ఆదివారం ముగ్గురిని డిశ్చార్‌ చేశారు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాధితులను ఆదివారం తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి పరామర్శించారు. 

Updated Date - 2021-12-20T04:58:04+05:30 IST