గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-10-22T05:19:56+05:30 IST
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు.
యలమంచిలి, అక్టోబరు 21 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని గుంపర్రు గ్రామానికి చెందిన ఉలసి శ్రీనివాస రావు (50) బుధవారం రాత్రి గుంపర్రు సెంటర్ నుంచి ఇంటికితిరిగి వెళుతుం డగా ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును బంధువులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జేవీఎన్ ప్రసాద్ తెలిపారు.