మోటార్‌ సైక్లిస్టు మృతి

ABN , First Publish Date - 2021-10-15T05:18:29+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మోటార్‌ సైక్లిస్టు మృతి చెందాడు.

మోటార్‌ సైక్లిస్టు మృతి

పెంటపాడు, ఆక్టోబరు 14:  రోడ్డు ప్రమాదంలో మోటార్‌ సైక్లిస్టు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఇజ్రోతు రమేష్‌(31) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మోటార్‌ సైకిల్‌పై అనంతపల్లిలో బంధువుల ఇంటికి వెళ్ళి  తిరిగి ప్రత్తిపాడు వస్తున్నాడు. ప్రత్తిపాడు జాతీయ రహదారి జంక్షన్‌ సమీపంలో మోటర్‌సైకిల్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రమేష్‌కు తలపై గాయం కావడంతో మృతి చెందాడు. పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో తణుకు ఏరియా ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2021-10-15T05:18:29+05:30 IST