పోలవరం తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ
ABN , First Publish Date - 2021-10-21T04:39:06+05:30 IST
పోలవరం తహసీల్దారు కార్యాలయానికి బుధవారం ఏసీబీ అధికారులు వచ్చారు.

పోలవరం, అక్టోబరు 20 : పోలవరం తహసీల్దారు కార్యాలయానికి బుధవారం ఏసీబీ అధికారులు వచ్చారు. గతంలో నిర్వాసితులను పునరావాసాలకు తరలించే ప్రక్రియలో సుమారు రూ. 1.5 కోట్లు అవినీతి జరిగిందని తహసీల్దారు కార్యాల యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ముఖ్యమైన ఫైళ్ళు స్వాధీనం చేసుకుని అప్పటి ఆర్డీవో, తహసీ ల్దారుపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులో ముఖ్యమైన మరి కొన్ని ఫైళ్ళ కోసం బుధవారం వచ్చిన ట్టు ఏసీబీ కార్యాల య అధికారులు తెలిపారు. కేసు పురోగతిపై ప్రశ్నిం చగా ఉన్నతాఽధికా రులు విచారిస్తున్నా రని చెప్పారు. మీడియా ప్రతినిధు లకు ఫోటోలు తీసు కోవడానికి వివరా లు, పేర్లు తెలపడా నికి నిరాకరించారు. తనిఖీలకు వచ్చిన అధికారులు వారికి అవసరమైన ఫైళ్ళు తీసుకు వెళ్లారని తహసీల్దార్ సుమతి తెలిపారు.