బౌద్ధ ధమ్మ పీఠంలో కఠిన చీవర దానం

ABN , First Publish Date - 2021-10-31T05:30:00+05:30 IST

ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠంలో ఆదివారం కఠిన చీవరదానం కార్యక్రమం పీఠాధిపతి అనాలయో ఆధ్వర్యంలో నిర్వ హించారు.

బౌద్ధ ధమ్మ పీఠంలో కఠిన చీవర దానం
శిష్యుల నుంచి కఠిన చీవర దానం స్వీకరిస్తున్న దృశ్యం

ఉండ్రాజవరం, అక్టోబరు 31: ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠంలో ఆదివారం కఠిన చీవరదానం కార్యక్రమం పీఠాధిపతి అనాలయో ఆధ్వర్యంలో నిర్వ హించారు.  కార్యక్రమానికి  బర్మా నుంచి ముగ్గురు, రాష్ట్రం నుంచి ముగ్గురు బౌద్ధ భిక్షవులు హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు ఏడాదికి ఒకసారి మాత్రమే ఉపాసకులు (శిష్యులు) నుంచి కఠిన చీవర దానం స్వీకరిస్తారు. చీవర దానం అనగా బౌద్ధ భిక్షువులు ధరించే వస్త్రాలు, ఇతర  నిత్యావసరాలు దానంగా స్వీకరించడం.  ఈ ఆరుగురితో పాటు పీఠాధిపతి అనాలయోకి శిష్యులు దాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆరాధన కార్యక్రమం అనంతరం భిక్షువులు ప్రవచనాలు చేశారు. అనంతరం భక్తులకు, ప్రజలకు అనాలయో  అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి భక్తులు విచ్చేశారు. 

Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST