ముంపు గ్రామాల నిర్వాసితుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-19T06:05:39+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతూ ముంపు గ్రామాల నిర్వాసితులు ర్యాలీ నిర్వహించారు.

ముంపు గ్రామాల నిర్వాసితుల ర్యాలీ
పోలవరంలో నిర్వాసితుల ర్యాలీ

పోలవరం, డిసెంబరు 18 : సమస్యల పరిష్కారం కోరుతూ ముంపు గ్రామాల నిర్వాసితులు ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష లు శనివారం 8వ రోజుకు చేరుకు న్నాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న ముంపు గ్రామాలు కొరుటూరు, శిరివాక, శివగిరి, చీడూరు, తెల్లదిబ్బల గ్రామాల ప్రజలు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మా ట్లాడుతూ పరిహారాలు అందకుండా గ్రామాలు ఖాళీ చేసేదిలేదన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కుల సాధన సమాఖ్య నాయకులు మిడియం వెంకటస్వామి, కారం వెంకటేశ్వరరావు, ఐక్యవేదిక నాయకులు గెల్లా రాజేష్‌,  కొరుటూరు, శివగిరి, చీడూరు, శిరివాక, తెల్ల దిబ్బల గ్రామాల సర్పంచ్‌లు, నిర్వాసితులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:05:39+05:30 IST