మహిళా సాధికారితే లక్ష్యం : మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-10-08T05:00:48+05:30 IST

మహిళలను అర్థిక బలోపేతం చేయడం ద్వారా సాధికారిత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

మహిళా సాధికారితే లక్ష్యం : మంత్రి వనిత
ఆసరా చెక్‌ అందజేస్తున్న మంత్రి వనిత, కలెక్టర్‌ మిశ్రా, ఎమ్మెల్యే కొఠారు

దెందులూరు, అక్టోబరు 7: మహిళలను అర్థిక బలోపేతం చేయడం ద్వారా సాధికారిత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గంగన్నగూడెంలో వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్ర మాన్ని దెందులూరు ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత, జడ్పీటీసీ నిట్టా లీలా నవ కాంతం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, ఎలిజా, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో కలిసి మహిళలకు ఆసరా చెక్‌లను అందజేశారు. మంత్రి వనిత మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,440 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరుగు తుందన్నారు. ఏఎంసీ చైర్మన్‌ మేకా లక్ష్మాణారావు, ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్‌ వి నాంచారయ్య, వెలుగుశాఖ ఏపీఎం దాసరి సుమలత, గాలాయగూడెం సర్పంచ్‌ చిలక వెంకట సుబ్బారావు, గోపన్నపాలెం సర్పంచ్‌ కోటి నాగ మల్లేశ్వరి కుమార్‌, 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:00:48+05:30 IST