పడిలేచిన కెరటం
ABN , First Publish Date - 2021-12-31T05:58:03+05:30 IST
2021.. వెళుతూ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. కొద్ది గంటల దూరంలో వున్న 2022 స్వాగతం పలుకుతోంది. ఈ సమయంలో ఒక్కసారి పాత సంగతులను గుర్తు చేసుకుని ముందుకు వెళదాం.

వర్షాలు.. వరదలు.. కర్షకుల కంట కన్నీరు
నష్టాల్లో ఆక్వా.. తిరిగొచ్చిన కంటెయినర్లు
పీఆర్‌సీ కోసం పట్టు బిగించిన ఉద్యోగులు..
ప్రజా వ్యతిరేక పాలనపై పార్టీలు ఆందోళన
పోలవరం పనులు.. అంతంత మాత్రమే
బిగిసిన జెండాలు.. నిర్బంధాలు
వెంటాడిన కరోనా.. చెదిరిన జీవన చిత్రం
ఏడాది పొడుగునా విషాదాలెన్నో..
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
2021.. వెళుతూ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. కొద్ది గంటల దూరంలో వున్న 2022 స్వాగతం పలుకుతోంది. ఈ సమయంలో ఒక్కసారి పాత సంగతులను గుర్తు చేసుకుని ముందుకు వెళదాం. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు పచ్చని నేలను అధోగతి పాలు చేశాయి. కరోనా ఉధృతి ముందు వేలాది మంది విలవిల్లాడి.. మరెందరో ప్రాణాలు కోల్పోయారు. సాధారణ జనజీవనం తిరగబడింది. ఎన్నడూ లేని చేదు అనుభవాలకు సాక్షి భూతమైంది. జల వనరుల శాఖ పరిధిలో పోలవరం పనులు మూలనపడ్డాయి. ఎత్తిపోతల పథకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ అక్షింతలు వేసింది. రాజకీయాలు శరవేగంగా సాగాయి. రైతులు, ఉద్యోగులు వీధులకెక్కారు. అన్ని జెండాలు రోడ్ల మీదకు వచ్చాయి. జంగారెడ్డిగూడెం సమీపాన జల్లేరు వాగులో బస్సు బోల్తా ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒడిదుడుకుల మధ్య సాగి.. పడిలేచిన కెరటంగా మారిన పశ్చిమపై రివ్యూ 2021.
కర్షకుల కంట కన్నీరే
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో వ్యవసాయ రంగం అనేక ఇక్కట్లకు గురైంది. దాళ్వా, సార్వా సాగులో ఆది నుంచి అంతం వరకు ప్రకృ తి వైపరీత్యాలు వెంటాడాయి. ఉపతల ఆవర్తనాల నుంచి పెను తుఫాన్ల వరకు రైతు కంట కన్నీరు మిగిల్చింది. గోదావరి పొంగింది.. వాగు లు నిండుగా సాగాయి. ఒకటికి రెండుసార్లు కుదుట పడదామన్న ఎక్కడా అవకాశమే కనిపిం చలేదు. ఆరుగాలం శ్రమించిన రైతు ఆగమాగమయ్యారు. చేతిలో చిల్లి గవ్వ లేక దిగాలు పడ్డారు. ప్రకృతి వైపరీత్యానికి 14 వేల ఎకరాల పంట దెబ్బతింది. విచిత్రం ఏమిటంటే ఇన్ని ఒడుదుడుకులు మధ్య చేతికొచ్చిన పంట సర్కారుకు అ మ్ముకుంటే పైసలు ఇవ్వడానికి ముప్పుతిప్పలు పడ్డారు. వరి సొమ్ముల కోసం రోడ్లపై రైతులే నిరసన కవాతు చేయాల్సి వచ్చింది. ఒకటి, రెండు కాదు ఓ వైపు రుణాలందక మరోవైపు ప్రకృతి సహకరించక మరోవైపు రైతులకు ఈ ఏడాది ఆసాంతం గుబు లు రేపింది. కష్టాన్ని మిగిల్చింది. ఆయువు పట్టు అయిన వ్యవసాయమే చాలాచోట్ల అడ్రస్ లేకుండా పోయింది. ఎర్ర కాలువ నుంచి త మ్మిలేరు వరకు పొంగి పొలాలను ముంచాయి. ఆక్వా అతలాకుతల మైంది. ధర లేక చేపలు, రొయ్యలు అమ్ముకోలేక వందల మంది నష్టపోయారు. ఆఖరికి విదేశాలకు వెళ్లిన రొయ్యల కంటెయినర్లు వెనుతిరిగాయి. సరాసరిన రూ.25 కోట్లు రైతుల చేయి జారాయి.
ప్రాజెక్టులు అంతంతే
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజె క్టు పనులకు ఈ ఏడాది ఎక్కడా ముహూర్తం కుదరలేదు. పనులు చేసే కూలీలు లేక, చేతికందని నిధులతో సర్కారు చేతులెత్తేంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని జంట గృహల్లో ఒకటి పైకప్పు కుప్పకూలింది. సాంకేతికంగా చేయలేదంటూ సర్కారు ముఖం తిప్పింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత కాలనీలు ఈ సారి బావురు మన్నాయి. మౌలిక సదుపాయాలు లేక నిర్వాసితులు అడుగిడలేదు. అఖరికి పది లక్షల పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. అయితే తన వంతు జీవో మాత్రం ఇచ్చింది. వందలాది మంది నిర్వాసితులు ప్రాజెక్టు కోసం భూమిలిచ్చిన త్యాగధనులు ఈ ఏడాది అంతానికి పోలవరంలో దీక్షకు దిగాల్సి వచ్చింది. ప్రాజెక్టు వ్యవహారం ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రకటనలు న డుమ పతాక శీర్షికలకు ఎకి ్కంది. జల వనరుల శాఖలో పనులు ఏవి ముందుకు సాగలేదు. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పను ల్లో పర్యావరణానికి చిక్కులు వచ్చాయంటూ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఈ ఏడాది కాలువల్లో నీటి సరఫరా ఆగమాగం అయితే దీని నుంచి బయటపడేందుకు తిప్పలు పడాల్సి వచ్చింది.
ఉద్యమాలు.. బిగిసిన పిడికిళ్లు
సర్కారు పైసా విదల్చలేక చతికిలపడితే రోడ్ల మీద గుంతల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. అన్ని రహదారులు అస్తవ్యస్తంగా మారితే అధికారులు చోద్యం చూశా రు తప్ప గంపెడు మట్టి వేయలేని దీన స్థితిని ఈ ఏడాది చవిచూశా రు. తాగునీటి కష్టాలు వెన్నాడాయి. ఎక్కడిక్కడ సరి చేస్తామంటూ హా మీలు ఇచ్చినా అవి ఆచరణకు నోచుకోలేదు. జనం పక్షాన ప్రతిపక్ష పార్టీలు నిరంతరాయంగా ఉద ్యమాలు చేస్తూ గళాలు విప్పాయి. టీడీపీ క్షేత్రస్థాయిలో అధికార వ్యతిరేక విధానాలపై విరుచుకుపడింది. అనేక సార్లు నేత లు గృహ నిర్బంధంలో ఉండిపోవాల్సి వచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగ్గా వీరవాసరం, ఆచంటలో వైసీపీకి చుక్కెదురైంది. అధికార పార్టీ ఆగడాలు నిలువరించేందుకు సర్వ శక్తులు వడ్డాల్సి వచ్చింది. వామపక్షాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆఖరికి జీతాలు రాని కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టరేట్ ముందు కూలబడితే పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వేలాది మంది రగిలిపోతూ నినదిస్తే చలించనూ లేదు. విధాన పరిషత్ చైర్మన్‌గా ఇదే జిల్లాకు చెందిన మోషేన్‌రాజుకు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లారు.
కరోనా ముందు బలాదూర్
ఈ ఏడాది ఐదు నెలలు మినహా మిగిలిన కాలమం తా కరోనా వెంటాడింది. ఆసుపత్రులు నిండాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దిక్కుతోచని స్థితిని అనుభవించారు. కరోనా దెబ్బకు అన్ని వసతులు కుప్పకూలాయి. లాక్‌డౌన్‌తో తేరుకోలేకపోయాయి. అంత కుమించి జనం ముందు అప్పులే మిగలగా అం తకు రెట్టింపు కష్టాలు, కన్నీళ్లు కనిపించాయి.
విషాదాంతం
ఈ ఏడాది చివరిలో బస్సు ప్రమాదం పలు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. డిసెంబరు 15న భద్రాచలం నుంచి బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు జంగారెడ్డిగూడెం మండ లం వేగవరం జల్లేవారు వాగులో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడగా ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ మేలనే ధైర్యంతో బస్సులు ఎక్కే వారంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. కాలం చెల్లిన బస్సులు, మరమ్మ తులు, నిర్వహణ లోపం వంటి లోటు పాట్లను కొత్త ఏడాదిలో అధిగమించి ఆర్టీసీ పేరు నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నారు.


