దూర విద్య కాంటాక్టు తరగతుల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-20T05:19:15+05:30 IST

దూర విద్య టెన్త్‌, ఇంటర్మీడియట్‌ కాంటాక్ట్‌ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఏపీ సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ వోఎస్‌ఎస్‌) రాష్ట్ర కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు.

దూర విద్య కాంటాక్టు తరగతుల పరిశీలన
ఏలూరు స్టడీ సెంటర్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 19: దూర విద్య టెన్త్‌, ఇంటర్మీడియట్‌ కాంటాక్ట్‌ తరగతుల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఏపీ సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ వోఎస్‌ఎస్‌) రాష్ట్ర కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా పలు అధ్య యన కేంద్రాల్లో ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల్లోని జడ్పీ హైస్కూళ్ల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లను సందర్శించి తరగతుల నిర్వహణను పరిశీలించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ దూర విద్య ప్రాముఖ్యతను వివరించారు. అభ్యసన మెళకువలను తెలియజేసి పరీక్షా విధానంపై సూచనలు చేశారు. అభ్యాసకులు కాంటాక్టు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందన్నారు. నూతనంగా అడ్మిషన్లు పొందిన అభ్యాసకులకు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి రికార్డుల నిర్వహణపై సూచనలు చేశారు. ఆయన వెంట ఏపీవోఎస్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-20T05:19:15+05:30 IST