యువత.. కేరింత
ABN , First Publish Date - 2021-11-29T04:33:13+05:30 IST
కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో విహార స్థలాలు కిటకిటలాడాయి. యువత కేరింతలు కొట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సందర్శనీయ ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి.

సాలూరు రూరల్, నవంబరు 28: కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో విహార స్థలాలు కిటకిటలాడాయి. యువత కేరింతలు కొట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సందర్శనీయ ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలతో పాటు జలపాతాల వద్ద పిల్లలు, యువకులు ఉత్సాహంగా గడిపారు. సాలూరు మండలం శిఖపరువు హనుమధార, దళాయివలస రాం ధార, దండిగాం, లొద్ద జలపాతాలు పర్యాటకుల రద్దీతో సందడిగా కనిపించాయి.