బాబు కన్నెర్రజేస్తే పాదయాత్ర ఉండేదా?

ABN , First Publish Date - 2021-10-22T04:53:33+05:30 IST

‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నెరజేసి ఉంటే జగన పాదయాత్ర సాగేదా?’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. విజయవాడ ఎన్టీఆర్‌ భవనంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు.

బాబు కన్నెర్రజేస్తే పాదయాత్ర ఉండేదా?
మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి

సాలూరు రూరల్‌, అక్టోబర్‌ 21: ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నెరజేసి ఉంటే జగన పాదయాత్ర  సాగేదా?’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. విజయవాడ ఎన్టీఆర్‌ భవనంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. నాడు వైసీపీ నేతలు చంద్రబాబును ఉరి తీయాలని, నడిరోడ్డులో కాల్చివేయాలని తిట్టినా ప్రజాస్వామ్య పంథాలో తమ అధినేత చిరునవ్వుతో మిన్నకున్నారని గుర్తు చేశారు. గ్రామస్థాయిలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు. దానిని పక్కదారి పట్టించడానికి పట్టాభి తిట్టారంటూ వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారని సంధ్యారాణి ఆరోపించారు.



Updated Date - 2021-10-22T04:53:33+05:30 IST