అధ్వానం..మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2021-10-30T04:54:09+05:30 IST

అలజంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై వస్తున్న అనేక ఆరోపణలపై అధికారులు స్పందించారు. పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్‌ రామస్వామి, ఎంఈవో లక్ష్మణరావులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు.

అధ్వానం..మధ్యాహ్న భోజనం
పాఠశాలలో విచారణ చేస్తున్న అధికారులు

 అన్నంలో పురుగులు  

 నాణ్యతకు తిలోదకాలు

  అలజంగి పాఠశాలలో ఎండీఎం నిర్వహణపై విచారణ

  ఆరోపణలు  వాస్తవమేనని తేల్చిన అధికారులు

బొబ్బిలి రూరల్‌: అలజంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై వస్తున్న అనేక ఆరోపణలపై అధికారులు స్పందించారు.  పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్‌ రామస్వామి, ఎంఈవో లక్ష్మణరావులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు.   విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో విడివిడిగా చర్చించి  వివరాలు సేకరించారు. భోజనంలో నాణ్యత ఉండడం లేదని, సరిపడా అన్నం పెట్టడం లేదని, మళ్లీ అడిగితే కసరుకుంటున్నారని విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఇటీవల అన్నం, మిల్‌ మేకర్‌లో పురుగులు కనిపించాయని తెలిపారు. విద్యార్థులు తమకు కూడా ఫిర్యాదు చేస్తున్నారని పేరెంట్స్‌ కమిటీ సభ్యులు చెప్పారు. విద్యార్థుల ఆరోపణలు వాస్తవమేనని విచారణలో తేలిందని, దీనిపై భోజన నిర్వాహకు రాలు పి.సత్యవతికి షోకాజ్‌ నోటీసు ఇస్తామని తహసీల్దార్‌, ఎంఈవో తెలి పారు. మండల మధ్యాహ్నభోజన కమిటీలో చర్చించి తదుపరి చర్యలు తీసు కుంటామని చెప్పారు. విచారణ నివేదికను సబ్‌కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. 

 

Updated Date - 2021-10-30T04:54:09+05:30 IST