కారు ఢీకొని మహిళకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-22T05:15:11+05:30 IST

రామభద్రపురం నుంచి బాడంగి వస్తున్న కారు స్థానిక స్టేట్‌ బ్యాంకు వద్ద ఎదురుగా వస్తున్న చల్లా నాగమణిని ఢీకొనడంతో ఆమెకు నుదిటిపై, ఎడమ బుజం, కుడి కాలుపై స్వల్ప గాయాలైనట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

కారు ఢీకొని మహిళకు గాయాలు

బాడంగి: రామభద్రపురం నుంచి బాడంగి వస్తున్న కారు స్థానిక స్టేట్‌ బ్యాంకు వద్ద ఎదురుగా వస్తున్న చల్లా నాగమణిని ఢీకొనడంతో ఆమెకు నుదిటిపై, ఎడమ బుజం, కుడి కాలుపై స్వల్ప గాయాలైనట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. ఆవులు మేపేందుకు నాగమణి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనలో 2 ఆవులకు ఒక్కొక్క కాలుకు గాయాలైనట్టు ఆయన చెప్పారు. డ్రైవర్‌ సిరిపురపు తిరుపతిరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

 

Updated Date - 2021-10-22T05:15:11+05:30 IST