కురుపాం కోటలో నేడు ఆయుధ పూజ

ABN , First Publish Date - 2021-10-15T04:40:31+05:30 IST

సుమారు మూడున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన కురుపాం సంస్థానంలో ఏటా దసరా రోజున ఆయుధ పూజను ఘనంగా నిర్వహిస్తారు. కొండదొర తెగకు చెందిన సన్యాసిదొర ఆద్యుడిగా 1672లో కురుపాం సంస్థానం ప్రారంభమైంది. అప్పట్లో కురుపాంకు సమీపంలో ఉన్న విశ్వనాథపురంలో వీరి కోట ఉండేది.

కురుపాం కోటలో నేడు ఆయుధ పూజ
కురుపాంలో కోటదుర్గ అలంకారంలో ప్రధాన ఖడ్గానికి పూజలు చేస్తున్న దృశ్యం

కురుపాం, అక్టోబరు 14: సుమారు మూడున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన కురుపాం సంస్థానంలో ఏటా దసరా రోజున ఆయుధ పూజను ఘనంగా నిర్వహిస్తారు. కొండదొర తెగకు చెందిన సన్యాసిదొర ఆద్యుడిగా 1672లో కురుపాం సంస్థానం ప్రారంభమైంది. అప్పట్లో కురుపాంకు సమీపంలో ఉన్న విశ్వనాథపురంలో వీరి కోట ఉండేది. కాలక్రమేణా కురుపాంలో కోట నిర్మించుకుని ఇక్కడి నుంచే పరిపాలించేవారు. సుమారు 300 ఏళ్ల కిందట విశ్వనాఽథపురం నుంచి కురుపాంకు తరలించిన ప్రధాన ఆయుధాలకే నేడు ఆయుధ పూజ నిర్వహిస్తున్నారు. దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి ఈ ఆయుధాల్లోని ప్రధాన ఖడ్గాన్ని కోట దుర్గగా ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించారు. కోటలోని మిగతా ఖడ్గాలు, బల్లేలు, తుపాకులకు దశమి రోజున పూజలు చేస్తారు. వైరిచర్ల వారసుడు, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. 



Updated Date - 2021-10-15T04:40:31+05:30 IST