AP: కొత్తవలసలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-12-09T18:23:43+05:30 IST
జిల్లాలోని కొత్తవలసలో భారీ చోరీ జరిగింది. జనార్దన్ నగర్లో ప్రైవేట్ లే అవుట్లోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు.

విజయనగరం: జిల్లాలోని కొత్తవలసలో భారీ చోరీ జరిగింది. జనార్దన్ నగర్లో ప్రైవేట్ లే అవుట్లోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. సుమారు 47 తులాల బంగారం, వెండి, రెండు లక్షల నగదును అపహరించారు. ఫింగర్ ప్రింట్స్ కూడా దొరక్కుండా ఆగంతకులు జాగ్రత్తపడ్డారు. బాధితుడు వేమూరి గంగాధరరావు గత రెండు నెలలుగా ఇంట్లో లేకుండా ఇంటికి తాళం వేసి ఉన్నాడు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని బాధితుడు ఆలస్యంగా గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.