అప్రమత్తత అవసరం : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-02-06T05:12:07+05:30 IST

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ తెలిపారు.

అప్రమత్తత అవసరం : ఆర్డీవో

 మెరకముడిదాం, ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఆర్డీవో  బీహెచ్‌ భవానీశంకర్‌ తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల సామగ్రిని పరిశీ లించారు.  మండలంలోని 29 పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు పూర్తిస్థాయిలో సామగ్రిని పంపిణీ చేయాలన్నారు. అన్ని శాఖల సిబ్బందిని సమన్వయ పరిచి ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని సూచించారు.  పోలింగ్‌ కేంద్రాల్లో వసతులపై ఆరాతీయాలని కోరారు. రాజకీయా లకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించాలన్నారు.   ఎంపీడీవో త్రినాథరావు, తహసీల్దార్‌ రత్నకుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

  గుర్ల:  మండల పరిషత్‌, రెవెన్యూ కార్యాలయాలను శుక్రవారం ఆర్డీవో భవానీ శంకర్‌ సందర్శించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఆర్‌వోలకు   పం చాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు.  నామినేషన్‌ల పర్వం సక్ర మంగా జరిగే విధంగా చూడాలన్నారు.  సచివాలయాల్లో పరిస్థితులను పరిశీలించి  అధికారులకు తెలియజేయాలని సూచించారు. తహసీల్దార్‌  లావణ్య , ఎంపీడీవో  కల్యాణి తదితరులు పాల్గొన్నారు. 

  నెల్లిమర్ల: నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ తదితర అంశాల్లో రిటర్నింగ్‌ అధికారులు , ఏఆర్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్డీవో భవానీ శంకర్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో  ఆర్వోలు, ఏఆర్వోలకు   శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని సూచించారు.  సమావేశంలో ఎంపీడీవో కె.రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ జి.రాము, ఈవోపీఆర్డీ హెచ్‌.భానోజీరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-06T05:12:07+05:30 IST