18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-08-22T04:47:41+05:30 IST

జిల్లాలోని 18 ఏళ్లు నిండిన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు కలెక్టర్‌ సూర్యకుమారి చెప్పారు. శనివారం సాయంత్రం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టర్‌ సూర్యకుమారి వెల్లడి

 కలెక్టరేట్‌, ఆగస్టు 21: జిల్లాలోని 18 ఏళ్లు నిండిన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు కలెక్టర్‌ సూర్యకుమారి చెప్పారు.  శనివారం సాయంత్రం  తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.  ఇప్పటికే  జిల్లాలో 80 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిల్లో 26 కేంద్రాల్లో కోవాగ్జిన్‌ వేస్తున్నామన్నారు. పీహెచ్‌సీలు, హెల్త్‌ సెంటర్లలో వ్యాక్సినేషన్‌ చేపడుతున్నామన్నారు. ఈనెల 24న 18 ఏళ్లు నిండిన బీసీ కళాశాల  విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు.  ఇప్పటివరకూ  9,74,091 మందికి మొదటి డోసు, 2,32,226 మందికి రెండో డోస్‌ వేశామని చెప్పారు. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు శతశాతం వ్యాక్సిన్‌ వేశామని స్పష్టం చేశారు. జిల్లాలోని జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండా లని సూచించారు. 

 జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి 

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ సూచించారు. ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌   ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాదపూర్వ కంగా కలిసి పుస్తకాలు అందించారు.  జిల్లా అభివృద్ధికి ప్రణాళిక తయారు చేస్తామని, దీనికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు. పల్లెలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, ఆసు పత్రులు, పాఠశాలలను దత్తత తీసుకోవ డంతో పాటు, కాలనీల నిర్మాణంలో భాగస్వా ములు కావాలని తెలిపారు. జిల్లాలో పర్యాటక అభివృద్థికి గాను ఓ యాప్‌ను రూపొం దించాలన్నారు.  జేసీ వెంకటరావు, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి , క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబోస్‌, రోటరీ హెల్త్‌ సెంట్రల్‌ చైర్మన్‌ గుప్త, బాలాజీ టెక్స్‌టైల్స్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష , కార్య దర్శులు బి.వెంకటరావు, నిర్మల ఉన్నారు. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు  

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ  సంక్షేమ పథకాలు అందజేసి, లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ, మెప్మా అధికారులతో సమీక్షించారు. ముందుగా ఆయా శాఖల్లో అమలవుతున్న పఽథకాలు, వాటి ప్రగతిని జేసీ వెంటరావు  వివరించారు.   అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలోని ఆయా ప్రాంతాల సామాజిక అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యూనిట్లు మంజూరు చేయాలని సూచిం చారు.  రికవరీ విషయంలో భోగాపురం, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఎందుకు వెనుక బడ్డాయని ప్రశ్నించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పఽథకాల అమలును పర్య వేక్షించాలని ఆదేశించారు. జగనన్న తోడు పఽథకం అమలు  వేగవంతం చేయాలన్నారు.  జిల్లాలోని పరిశ్రమలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని , నైపుణ్య శిక్షణ అందిం చాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో  హౌసింగ్‌ లోన్స్‌పై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గుంకలాం లేఅవుట్‌ లబ్ధిదా రులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ అశోక్‌ కుమార్‌, ఏపీడీ సావిత్రి, మెప్మా పీడీ సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-22T04:47:41+05:30 IST