కళ్లికోటలో వెలగని భోగి మంట
ABN , First Publish Date - 2021-01-12T05:14:00+05:30 IST
సంక్రాంతి పండగకు ముందు రోజు అంతటా భోగి మంటలు వేడయం ఆనవాయితీ. కానీ కళ్లికోట గ్రామస్థులు భోగి మంట వేయరు.
కొమరాడ, జనవరి 11 : సంక్రాంతి పండగకు ముందు రోజు అంతటా భోగి మంటలు వేడయం ఆనవాయితీ. కానీ కళ్లికోట గ్రామస్థులు భోగి మంట వేయరు. దీనికి ఒక కారణం ఉంది. గతంలో గ్రామంలో వేసిన భోగి మంటల్లో రెండు దున్నపోతులు పడి మృతి చెందాయి. అప్పటి నుంచి వారు భోగి పండగకు దూరమయ్యారు. అయితే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగలను మాత్రం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. పూర్వీకుల హయాంలో గ్రామంలో జరిగిన సంఘటనతో భోగి మంట వేయకూడదని పెద్దలు నిర్ణయించారని, నేటికీ అది పాటిస్తున్నామని మాజీ ఎంపీటీసీ సభ్యుడు కలిపిండి సోమినాయుడు తెలిపారు.
భారతీయ విద్యాకేంద్రంలో సంక్రాంతి సంబరాలు
కొత్తవలస: కొత్తవలసలోని భారతీయ విద్యాకేంద్రంలో సోమవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా ర్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు కరస్పాండెంట్ ఎంఎస్‌ఎస్ శర్మ బహుమతులు అందజేశారు. అనంతరం భోగి, మకర సం క్రాంతి, కనుమ పండగల గొప్పతనం విద్యార్థులకు తెలిపారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం డీఏవీ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.