గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-05-22T05:29:57+05:30 IST
నగరంలోని ట్యాంకు బండ్ రోడ్డు సమీపంలోని అచంట గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం కాలిన గాయాలతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు వన్‌టౌన్ సీఐ మురళీ తెలిపారు.

విజయనగరం క్రైం: నగరంలోని ట్యాంకు బండ్ రోడ్డు సమీపంలోని అచంట గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం కాలిన గాయాలతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు వన్‌టౌన్ సీఐ మురళీ తెలిపారు. కాలిన గాయాలతో ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నట్టు స్థానికుల సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించామని చెప్పారు. మృతుడు ఎవరన్నది గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని, మృతుడు పక్కన కాలిన దుప్పటి వుందన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమి త్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించామని చెప్పారు. మృతుడు ఆచూకీ తెలిసిన వారు 9121109419, 9121109437 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.