రైలు ఢీకొని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-03-23T05:24:29+05:30 IST

పార్వతీపురం ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

రైలు ఢీకొని ఇద్దరి మృతి

పార్వతీపురం, మార్చి 22: పార్వతీపురం ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పార్వతీపురం మండలం నర్సిపురం సమీపాన అదే గ్రామానికి చెందిన దగ్గు ఉదయం అప్పలనాయుడు(44) సోమ వారం గుడ్సు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఇతనికి భర్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డైవర్‌గా పని చేస్తున్న ఈయన గత 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ పిల్లలతో జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి కొమరాడ మండలం సివిని గ్రామం వద్ద రైలు ఢీకొనడంతో శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోదులుగుమడ గ్రామానికి చెందిన ఎ.సూర్యనారాయణ(45) వ్యక్తి మృతి చెందాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

 

Updated Date - 2021-03-23T05:24:29+05:30 IST