అనారోగ్యంతో గిరిజన యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-10-28T05:38:00+05:30 IST
మండలంలోని బొడ్డవర పంచా యతీలో గిరిశిఖర గ్రామమైన చిట్టెంపాడుకు చెందిన జన్ని గంగులు(20) అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.

శృంగవరపుకోట రూరల్: మండలంలోని బొడ్డవర పంచా యతీలో గిరిశిఖర గ్రామమైన చిట్టెంపాడుకు చెందిన జన్ని గంగులు(20) అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈవిష యంపై గ్రామ గిరిజనులు మాట్లాడుతూ గంగులు గత కొద్దిరోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్నాడని అయితే, బుధవారం మరిం త అస్వస్థతతకు గురికావడంతో కొండ కిందకు డొలీ ద్వారా దించు తున్న సమయంలో మరణించాడని తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.