ముగ్గురు ఉద్యోగులపై బదిలీ వేటు

ABN , First Publish Date - 2021-08-28T05:26:49+05:30 IST

చీపురుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వీఆర్వో వెంకటరమణ ఏసీబీ వలకు చిక్కిన నేపథ్యంలో సిబ్బందిని మార్పు వంటి చర్యలకు ఉపక్రమించారు.

ముగ్గురు ఉద్యోగులపై బదిలీ వేటు

చీపురుపల్లి: చీపురుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వీఆర్వో వెంకటరమణ ఏసీబీ వలకు చిక్కిన నేపథ్యంలో  సిబ్బందిని మార్పు వంటి చర్యలకు ఉపక్రమించారు. ఆర్‌ఐ గౌతంకుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ శంకరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సుజాతలపై ఇప్పటికే బదిలీ వేటు పడగా, మండల సర్వేయర్‌ ఎం.సత్యనారాయణను కూడా తక్షణమే  పంపించాలని  భావి స్తున్నట్టు తెలిసింది. 

 

Updated Date - 2021-08-28T05:26:49+05:30 IST