రైలు ఢీకొని ఒకరి దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-21T05:45:14+05:30 IST
స్థానిక బంగారమ్మకాలనీ గేటు వద్ద రైలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు.

బెలగాం, నవంబరు 20: స్థానిక బంగారమ్మకాలనీ గేటు వద్ద రైలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. రైల్వే పోలీసులు అందించిన వివరాలిలా మేరకు... శనివారం ఉదయం 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొం ది. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉండి, నీలం రంగు టీషర్టు, బ్రౌన్ ప్యాంట్ ధరించాడు. ప్రమాదంలో తల భాగం ఛిద్రమైంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.