రూ.2.50 లక్షలకు టోకరా..!

ABN , First Publish Date - 2021-07-24T05:53:50+05:30 IST

తక్కువ ధరకే ఎక్కువ బంగారం వస్తుందని నమ్మాడు. అత్యాశకు పోయి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి మోసపోయాడు.

రూ.2.50 లక్షలకు టోకరా..!

భోగాపురం, జూలై 23: తక్కువ ధరకే ఎక్కువ బంగారం వస్తుందని నమ్మాడు. అత్యాశకు పోయి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి మోసపోయాడు. చివరకు  పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన భోగాపురంలో  చోటుచేసుకుంది. రావాడ గ్రామానికి చెందిన మందపు రాములప్పడు భోగాపురం ఎత్తుబ్రిడ్జి సమీపంలో స్వీట్‌ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఆయన వద్దకు ఇద్దరు వ్యక్తలు వచ్చి మాటలు కలిపి, తమకు డబ్బు చాలా అవసరం ఉందని చెప్పారు.   తమ దగ్గర 22 తులాల బంగారు ముద్ద ఉందని, దీనిని తక్కువకే ఇచ్చేస్తా మన్నా రు. వారిని నమ్మిన రాములప్పడు బంగారం ఇవ్వండి, పరిశీలించి తీసు కొంటామ న్నారు. ‘బంగారం అంతా తీసుకెళితే కుదరదు, ఇందులో చిన్న ముక్క తీసుకెళ్లి పరీక్షించుకోండి’ అని చెప్పి వారి దగ్గర అదనంగా ఉన్న ఓ చిన్న పాటి బంగారాన్ని ఇచ్చి, తొందరగా రావాలని, లేదంటే వెళ్లిపోతామని తెలిపారు. దీంతో బాధితుడు ఆ బంగారాన్ని తీసుకొని పూసపాటిరేగలో  తనిఖీ చేయించుకుని అతి స్వచ్ఛమైనదిగా నిర్ధారించుకున్నాడు. దీంతో ఆయన క్షణాల్లో తిరిగొచ్చి రూ.2లక్షల 50వేలు నగదు ఇచ్చి, వారి దగ్గరున్న సుమారు 22 తులాల బరువున్న బంగారు ముద్ద తీసుకొన్నాడు. ఆ వ్యక్తలు ఉండగానే బాధితుడు దాన్ని మళ్లీ పూసపాటి రేగలో తనిఖీ చేయించాడు. రెండో సారి తీసుకెళ్లిన బంగారు ముద్దలో కనీసం గ్రాము కూడా బంగారం లేనట్లు గుర్తించారు. దీంతో మోసపోయానంటూ తెలుసు కున్న రాములప్పడు క్షణాల్లో షాపు వద్దకు వచ్చి చూడగా ఆ ఇద్దరు వ్యక్తలు వెళ్లి పోయారు. దీంతో లబోదిబోమని రోదిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు. 

 

Updated Date - 2021-07-24T05:53:50+05:30 IST