ప్రయాణికురాలిని బెదిరించి పుస్తెలతాడు చోరీ

ABN , First Publish Date - 2021-11-21T05:48:28+05:30 IST

ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలిని బెదిరించి అదే ఆటో డ్రైవర్‌ సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును దోచుకున్నాడు.

ప్రయాణికురాలిని బెదిరించి పుస్తెలతాడు చోరీ

  ఓ ఆటో డ్రైవర్‌ నిర్వాకం 

 నెల్లిమర్ల: ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలిని బెదిరించి అదే ఆటో డ్రైవర్‌ సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును దోచుకున్నాడు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొప్పడాం గ్రామానికి చెందిన అంబళ్ల వరహాలమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం రామతీర్థం జంక్షన్‌ నుంచి బొప్పడాం వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే డ్రైవర్‌ ఆటోను బొప్పడాం వైపు పోనివ్వకుండా జోగిరాజుపేట మార్గంలో మళ్లించాడు. వృద్ధురాలి పక్కకు వచ్చి మెడపై కత్తి పెట్టి, మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడును బలవం తంగా లాక్కున్నాడు. వృద్ధురాలు అరిచేందుకు ప్రయత్నించగా నోరు, మెడ నొక్కే శాడు. అనంతరం బయటకు తోసేసి, ఆటోతో వెళ్లిపోయాడు. ఆటో ఉన్న మరో ప్ర యాణికుడు కూడా డ్రైవర్‌కు సహకరించినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు విచారణ ప్రారంభించారు. రామతీర్థం దేవస్థానం వద్ద రోడ్డుపై ఉన్న సీసీ  ఫుటేజీలను విజయనగరం రూరల్‌ సీఐ టి.సత్యమంగవేణితో పాటు ఎస్‌ఐ రవీంద్రరాజు, విజయనగరం సీసీఎస్‌ పోలీసులు పరిశీలించారు. అనుమానిత ఆటో డ్రైవర్‌ శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందినవాడిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. విచారణ కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-21T05:48:28+05:30 IST