పట్టపగలే చోరీ

ABN , First Publish Date - 2021-03-15T05:29:58+05:30 IST

మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ రాజులకల్లాలు జంక్షన్‌లో పట్టపగలే జరిగిన చోరీ సంఘటన కలకలం రేపింది.

పట్టపగలే చోరీ

శృంగవరపుకోట రూరల్‌, మార్చి 14: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ రాజులకల్లాలు జంక్షన్‌లో పట్టపగలే జరిగిన చోరీ సంఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజులకల్లాలకు చెందిన అర్జున్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఎప్పటికలానే శనివారం ఉదయం ఆటో నడుపుకోవడానికి వెళ్లగా ఇతని తల్లిదండ్రులు ఉపాధి హామీ పనులకు వెళ్లిపోయారు. అయితే ఉదయం 10.30 సమయం లో గుర్తుతెలియని వ్యక్తి ఇంటితాళం పగలకొట్టి ఇంట్లో ఉన్న రూ.లక్ష 50వేలు ఎత్తుకుపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసును ఎస్‌ఐ నీలకంఠం నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనం తెలిసినవారి పనే అయి ఉండవచ్చని బాధితులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-15T05:29:58+05:30 IST