గోడ కూలి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-15T05:27:23+05:30 IST

గోడ కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలం లోని ములక్కాయవలస గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

గోడ కూలి వ్యక్తి మృతి

మక్కువ, మార్చి 14: గోడ కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలం లోని ములక్కాయవలస గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పాపయ్యవలస గ్రామానికి చెందిన యామలపల్లి అప్పలనాయుడు (49) ములక్కాయవలస గ్రామ సమీపంలో ఉన్న రైస్‌ మిల్లులో గత పది రోజులుగా కూలి పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆయన ఆదివారం రైసు మిల్లులోని ధాన్యం మిషన్‌ వద్ద పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి మిషన్‌పై పడింది. ఆ మిషన్‌ ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ కె.రాజేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

Updated Date - 2021-03-15T05:27:23+05:30 IST