బావిలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-14T05:11:52+05:30 IST

బంటుపల్లి శివారులో ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు.

బావిలో పడి వ్యక్తి మృతి

డెంకాడ : బంటుపల్లి శివారులో ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతి చెందినట్టు  ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. మృతుడు విజయనగరం పట్టణాని కి చెందిన కరకవలస శ్రీనివాస్‌ పట్నాయక్‌ (38) గుర్తించినట్టు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఘోషాసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపధికన ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తు న్నాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తన స్నేహితుడికి సుమారు రూ.8 లక్షలు ఇవ్వగా... రెండు ఏళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.  

 

Updated Date - 2021-01-14T05:11:52+05:30 IST