విశాఖలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

ABN , First Publish Date - 2021-10-07T05:50:50+05:30 IST

విశాఖలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

విశాఖలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
కేజీహెచ్‌లో బాధితులను పరామర్శిస్తున్న సువ్వాడ వనజాక్షి

- స్వగ్రామంలో విషాదఛాయలు

చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13) మంగళవారం రాత్రి విశాఖలో దారుణహత్యకు గురైంది. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. ఓ కుటుంబం బతుకుతెరువు నిమిత్తం విశాఖ వలసపోయింది.  తండ్రి అగనం పూడి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుండ గా.. కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వారికి కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరూ అగనంపూడిలోనే చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక సో మవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది.  మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌కు సమీపంలోని మరో భవనం వద్ద అచేతనంగా పడిఉంది. గమనించేసరికి మృతి చెందింది. బుధవారం ఉదయం కుటుంబసభ్యు లు, బంధువులు ఘటనాస్థలం వద్ద ఆందోళనకు దిగారు. ఇది ముమ్మాటికీ హత్యేనని.. అత్యాచారం చేసి చంపారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మహిళలకు రక్షణ కరువు

- పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

నెల్లిమర్ల : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురా లు సువ్వాడ వనజాక్షి ఆరోపించారు. జిల్లాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని బుధవారం కేజీహెచ్‌లో  పరామర్శించారు. ఈ సందర్భంగా వనజాక్షి విలేఖరులతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అకృత్యాలు పెరగడంపై ఆం దోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించనవారిలో సు వ్వాడ రవి శేఖర్‌, అనురాధ బేగం ఉన్నారు. 

Updated Date - 2021-10-07T05:50:50+05:30 IST