పన్నుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T05:45:02+05:30 IST

మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీల నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని ఏఐఎఫ్‌టీయూ ప్రతినిదులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజురెడ్డిలు డిమాండ్‌ చేశారు.

పన్నుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి

 దాసన్నపేట: మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీల నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని ఏఐఎఫ్‌టీయూ ప్రతినిదులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజురెడ్డిలు డిమాండ్‌ చేశారు. సోమ వారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణం నిర్ణ యాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి తెరతీసిందని ఆరోపించారు. అనం తరం కమిష నర్‌కు వినతిపత్రం అందజేశారు. అప్పలరాజు, గిరిప్రసాద్‌ పాల్గొన్నారు. 

పార్వతీపురంటౌన్‌: కరోనా వల్ల పట్టణ ప్రజలు ఆర్థికం గా చితికిపోతే రాష ్ట్రప్రభుత్వం ఆస్తి, చెత్త, తాగునీటి పన్నులను విఽధించి మ రింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సీపీఎం (ఎమ్‌ఎల్‌), సీఎంపీ (ఎంఎల్‌ న్యూడెమోక్రసి)ల ఆధ్వ ర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు నర్సింగరావు, భాస్కరరావు మా ట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజల్‌ ధరలను పెంచడం ద్వారా భారం పెంచితే, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, చెత్త, తాగనీటి పన్నులను విధిం చి నానా ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-06-22T05:45:02+05:30 IST