కమ్ముకున్న మేఘాలు..కురిసిన చిరుజల్లులు!
ABN , First Publish Date - 2021-05-22T04:16:53+05:30 IST
ధ్యాహ్నం 3 గంటల వరకూ తీక్షణమైన ఎండ, ఉక్కపోత. తరువాత ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. విజయనగరాన్ని మేఘాలు ఆవహించాయి. భారీ వర్షం తప్పదని అనుకున్నా... చిరుజల్లులతో ప్రకృతి సరిపెట్టేసింది.. గజపతినగరం, గంట్యాడ, మెంటాడ, చీపురుపల్లి, గరివిడి, దత్తిరాజేరు, బాడంగి, మక్కువ, తెర్లాం, గుర్ల. ఎల్

వర్షంతో సేదదీరిన ప్రజలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 21 : మధ్యాహ్నం 3 గంటల వరకూ తీక్షణమైన ఎండ, ఉక్కపోత. తరువాత ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. విజయనగరాన్ని మేఘాలు ఆవహించాయి. భారీ వర్షం తప్పదని అనుకున్నా... చిరుజల్లులతో ప్రకృతి సరిపెట్టేసింది.. గజపతినగరం, గంట్యాడ, మెంటాడ, చీపురుపల్లి, గరివిడి, దత్తిరాజేరు, బాడంగి, మక్కువ, తెర్లాం, గుర్ల. ఎల్. కోటలో ఓ మోస్తరు వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీయడంతో మామిడికి అపార నష్టం కలిగింది. ఖరీఫ్ దుక్కులకు, వరి ఆకుమడులు సిద్ధం చేసుకునేందుకు వర్షం ఉపకరిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో సేదదీరారు.