రైల్వేట్రాక్‌పై యువకుడి మృతదేహం
ABN , First Publish Date - 2021-11-21T05:46:30+05:30 IST
జిల్లా కేంద్రం, రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై శనివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు జీఆర్పీ ఎస్‌ఐ రవివర్మ తెలిపా రు.

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రం, రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై శనివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్టు జీఆర్పీ ఎస్‌ఐ రవివర్మ తెలిపా రు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారం నగరంలోని ఉల్లివీధి నివాసిగా గుర్తించామన్నారు. మృతుడి వయస్సు 28ఏళ్లు ఉంటుందని, అవివాహితుడిగా గుర్తించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.