అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-29T05:16:09+05:30 IST

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం
కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు చెక్‌ అందిస్తున్న దృశ్యం

  వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ 

కలెక్టరేట్‌, డిసెంబరు 28 : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే  ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ తెలిపారు.  మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్ర మాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వివక్ష  లేకుండా అర్హతే ప్రాతిపదికగా పథకాలు అందిస్తున్నామన్నారు.  గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో నెలకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ.1450 కోట్లు పింఛన్‌ కోసం వెచ్చిస్తున్నామని  సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని రూ.2250 చేశామని, జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2500 అం దిస్తామని వెల్లడించారు. 12 సంక్షేమ పఽథకాల కింద మిగిలిపోయిన లబ్ధిదారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ పఽథకాలకు అర్హులైన 24,357 మందికి  రూ.34,31,61,000  మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.  డీఆర్‌డీఏ ద్వారా  లబ్ధిదారులకు అందించనున్న రూ.33,84 కోట్ల చెక్కును స్వయం శక్తి మహిళలకు అందించారు. జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు రఘురాజు, పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు  కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి  వెంకట చినఅప్పలనాయుడు, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, డీఆర్‌డీఏ పీడీ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-12-29T05:16:09+05:30 IST