ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-14T05:09:53+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలు ఎట్టకేలకు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి విడతగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ (ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు) హెచ్‌ఎంలకు బదిలీ స్థానాలను కేటాయించారు. ఎల్‌ఎల్‌ఎఫ్‌ హెచ్‌ఎంలు తమ కేటాయించిన బదిలీ స్థానం ( కొత్త పాఠశాల )లో వెంటనే చేరాల్సి ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం

సాలూరు రూరల్‌, జనవరి 13 : ఉపాధ్యాయ బదిలీలు ఎట్టకేలకు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి విడతగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ (ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు) హెచ్‌ఎంలకు బదిలీ స్థానాలను కేటాయించారు. ఎల్‌ఎల్‌ఎఫ్‌ హెచ్‌ఎంలు తమ కేటాయించిన బదిలీ స్థానం ( కొత్త పాఠశాల )లో వెంటనే చేరాల్సి ఉంది.  గత నెల 31తో వెబ్‌ ఆప్షన్స్‌ ముగిసింది. బదిలీ స్థానాలను కేటాయించే సమయంలో స్థానిక ఎన్నికల ప్రకటన రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చింది.  ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బదిలీలకు మార్గం సుగమం అయ్యింది.  దీంతో బదిలీలకు మళ్లీ కోడ్‌ అడ్డంకి రాకుండా ఉండేందుకు ఈ నెల 18లోగా బదిలీల ప్రక్రియ పూర్తికి విద్యాశాఖ  చర్యలు చేపట్టింది. కోర్టు కేసులున్న కేడర్ల ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కాకుండా ఎల్‌ఎఫ్‌ఎల్‌, పాఠశాల సహాయకులు, ఎస్జీటీలకు బదిలీలు స్థానాలను ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. తొలుత ఎల్‌ఎఫ్‌ఎల్‌కు బదిలీస్థానాలు కేటాయించారు. ఈ నెల 14న పాఠశాల సహాయకులకు, ఈ నెల 16న ఎస్జీటీలకు బదిలీలు స్థానాలు కేటాయించే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాలంటున్నాయి. జిల్లాలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 106 మంది, పాఠశాల సహాయకులు ఇంగ్లిషు 260 మంది, గణితం 299 మంది, ఫిజికల్‌ సైన్స్‌ 248, బయోలాజికల్‌ సైన్స్‌ 218 మంది, సాంఘిక శాస్త్రం 232 మంది, ఎస్జీటీ 2428 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి బదిలీ స్థానాలను కేటాయించే అవకాశాలున్నాయి.  పండుగ రోజుల్లో బదిలీలు జరిపి వెంటనే కొత్తస్థానంలో చేరాలనడం సబబు కాదని  ఆపస్‌  రాష్ట్ర సహా అధ్యక్షుడు జాగాన రామునాయుడు తదితరు అన్నారు.  

Updated Date - 2021-01-14T05:09:53+05:30 IST