ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా?

ABN , First Publish Date - 2021-10-22T05:06:34+05:30 IST

సర్కార్‌ అరాచకాలను ప్రశ్నిస్తే వైసీపీ శ్రేణులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి ప్రశ్నించారు.

ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా?
నెల్లిమర్ల: మాట్లాడుతున్న జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

  వైసీపీ శ్రేణుల తీరుపై టీడీపీ నేతల మండిపాటు 

  ప్రభుత్వ ధోరణి మార్చుకోవాలని డిమాండ్‌

 నెల్లిమర్ల:  సర్కార్‌ అరాచకాలను ప్రశ్నిస్తే వైసీపీ శ్రేణులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి ప్రశ్నించారు. గురువారం నెల్లిమర్లలోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, నేతల ఇళ్లపై వైసీపీ నేతల దాడికి నిరసనగా  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని  కోరారు.  ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మార్చుకోవాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్ప దని హెచ్చరించారు.  ఈ సమావేశంలో జిల్లా మహిళా కార్యదర్శి లెంక హైమావతి, పార్టీ నాయకులు కళావతి, పార్వతి, సత్యవతి పాల్గొన్నారు. 

 హేయమైన చర్య 

 డెంకాడ: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న 36 గంటల దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, డెంకాడ పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ దౌర్జన్యాలను సమష్టిగా ఎదుర్కో వల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రోతు బంగార్రాజు, డెంకాడ మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారా యణ, విజయనగరం పార్లమెంట్‌ సెక్రటరీ పాణిరాజు,  పార్టీ  మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌, నాయ కులు తమ్మినాయుడు, ప్రసాద్‌, కార్యకర్తలు   పాల్గొన్నారు. 

ఎన్నడూ లేని విధంగా.. 

తెర్లాం (బలిజిపేట): టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ అరకు పార్లమెంటరీ కార్యదర్శి అప్పారావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాల యంపై దాడులుచేసి మళ్లీ జనాగ్రహ దీక్షలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో   తగినవిధంగా గుణపాఠం చెబుతా రని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పి.వేణునాయుడు, టీడీపీ సీనియర్‌ నాయకులు మీసాల మనోహర్‌నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-22T05:06:34+05:30 IST