ట్యాక్సీ డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-20T05:20:47+05:30 IST

పట్టణంలోని సోఫా క్వార్టర్స్‌లో ఉంటున్న ట్యాక్సీ డ్రైవర్‌ వాండ్రంకి శివ (32) ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాక్సీ డ్రైవర్‌ ఆత్మహత్య

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 19: పట్టణంలోని సోఫా క్వార్టర్స్‌లో ఉంటున్న ట్యాక్సీ డ్రైవర్‌ వాండ్రంకి శివ (32) ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివ రెండేళ్లుగా సొరియాసిస్‌ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇది జీవితాంతం నయం కాని వ్యాధి అని కలత చెంది ఈ అఘా యిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శివకు పెళ్లి కాలేదు. అతని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని ఎస్‌ఐ తెలిపారు. 

 

Updated Date - 2021-12-20T05:20:47+05:30 IST