అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-05-19T04:51:55+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

బెలగాం : అగ్రిగోల్డ్‌ బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెలగాం రైతుబజార్‌ కూడలిలో గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు మాట్లాడుతూ... ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో  అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం బ్రాంచి అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, వై.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T04:51:55+05:30 IST