చెట్ల కిందే చదువులు!

ABN , First Publish Date - 2021-10-30T04:12:54+05:30 IST

‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందని ప్రభుత్వం ఒక పక్క చెప్పుకొస్తోంది. మౌలిక వసతులు మెరుగుపడ్డాయని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలలను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో పెద్ద పాఠశాలల్లో ఒకటైన రామభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ చెట్ల కిందనే తరగతులు నిర్వహిస్తున్నారు. 1,004 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 7 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆరుబయట వరండాలో, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు.

చెట్ల కిందే చదువులు!
ఆరుబయట విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు


రామభద్రపురం :‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందని ప్రభుత్వం ఒక పక్క చెప్పుకొస్తోంది. మౌలిక వసతులు మెరుగుపడ్డాయని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలలను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది.  వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో పెద్ద పాఠశాలల్లో ఒకటైన రామభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ  చెట్ల కిందనే తరగతులు నిర్వహిస్తున్నారు. 1,004 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 7 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆరుబయట వరండాలో, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరుబయటే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెరిగాయని చేర్పిస్తే.. ఇదేమిటీ పరిస్థితి?’‘‘‘‘‘‘’‘‘8 అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనపు గదులను నిర్మించాలని కోరుతున్నారు 



Updated Date - 2021-10-30T04:12:54+05:30 IST