కట్టుదిట్టంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-19T04:47:32+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 31 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా మంగళవారం నుంచి తనిఖీలు పెంచారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్డుపై ఎవరు కనిపించినా ఆరా తీస్తున్నారు.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ
విజయనగరం ఎన్‌సీఎస్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బారీకేడ్లు

ప్రధాన కూడళ్లల్లో స్టాపర్స్‌తో దారుల మూసివేత 

విజయనగరం క్రైం : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూను ప్రభుత్వం ఈ నెల 31 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా మంగళవారం నుంచి తనిఖీలు పెంచారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్డుపై ఎవరు కనిపించినా ఆరా తీస్తున్నారు. పనిలేకుండా వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.  ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఏ ఒక్క దుకాణం తెరుచుకున్నా తక్షణమే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కేసులు నమోదు చేయాలని సిబ్బందికి ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయటకు వచ్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, వాహనాలు సీజ్‌ చేయాలని నిర్దేశించారు. దీంతో ఎస్‌ఐలు, సీఐలు, కానిస్టేబుళ్లు ఎక్కడికక్కడే నిఘా పెట్టారు. బారికేడ్లతో ప్రధాన కూడళ్లను దిగ్బంధం చేస్తున్నారు. అందుకు తగినట్టే ప్రజలు కూడా సహకరిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో అన్ని వీధులు, జంక్షన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 


Updated Date - 2021-05-19T04:47:32+05:30 IST